తెలంగాణ

telangana

By

Published : May 11, 2020, 6:20 PM IST

ETV Bharat / bharat

కరోనాపై పోరులో ఆయుర్వేద మందుకు చోటు

శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద మందు ఫిఫట్రాల్​కు అరుదైన గుర్తింపు లభించింది. కరోనాకు చెక్​ పెట్టగలిగే మందుల జాబితాలో చోటు దక్కించుకుంది. ఇటీవల కొంతమంది నిపుణులు పరిశోధనలు జరిపి, ఈ నివేదిక రూపొందించారు.

Fifatrol as an immunity-boosting ayurvedic drug
కరోనాపై పోరులో ఆయుర్వేద మందుకు చోటు

కొవిడ్​-19 మహమ్మారి నియంత్రణకు ఆయుర్వేద ఔషధం ఫిఫట్రాల్​ పనికొస్తుందని.. జాతీయ పరిశోధన అభివృద్ధి మండలి (ఎన్​ఆర్​డీసీ) నిపుణులు పేర్కొన్నారు. స్వదేశీ సాంకేతికతలు, పరిశోధనల ఆధారంగా తయారు చేసిన మందుల జాబితాలో దీనికి చోటు దక్కింది.

ఫిఫట్రాల్​ రోగనిరోధక శక్తిని పెంచి వైరస్​, బ్యాక్టీరియాలను చంపేస్తుందని స్పష్టం చేశారు నిపుణులు. ఈ మందు వాడితే బాధితుడు త్వరగా మహమ్మారి నుంచి కోలుకునే అవకాశముందని స్పష్టం చేశారు.

" ఫిఫట్రాల్‌లో రోగనిరోధక శక్తిని పెంచే మూలికలు ఉన్నాయి. బ్యాక్టీరియాతో వచ్చే జ్వరం, దగ్గు, జలుబు, చర్మ వ్యాధులు, తలనొప్పికి సమర్థంగా పనిచేస్తుంది. శ్వాశనాళంలో వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌, ఫ్లూ నివారణకు ఈ ఔషధాన్ని ఇప్పటికే ఉపయోగిస్తున్నారు"

-- ఎన్​ఆర్​డీసీ నిపుణులు

ఫిఫట్రాల్‌ను ఏఐఎంఐఎల్‌ ఫార్మా సంస్థ తయారుచేస్తోంది. ఎలాంటి దుష్ఫ్రభావాలు లేకుండా ఈ మందు కాలేయాన్ని బలవర్ధకం చేస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సుదర్శన్‌ వటి, సంజీవని వటి, గోదాంతి భస్మ, త్రిభువన కిర్తిరసం, మృత్యుంజయ రసం, తులసి, కుత్కి, చిరయత, మోఠా, గిలోయ్‌ వంటి మూలికలు ఇందులో ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details