తమిళనాడు కాంచీపురం జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని శ్రీపెరంబదూరులో తన 12, 10 ఏళ్లు ఉన్న ఇద్దరు కుమార్తెలు, ఎనిమిదేళ్ల కుమారుడిని చంపి.. ఆపై చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి.
పిల్లలను చంపి... ఆపై చెట్టుకు ఉరివేసుకున్న తండ్రి - Father killed the children and then hanged himself on the tree in Tamil Nadu
తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. కాంచీపురం జిల్లాలో తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని చంపి, అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పిల్లలను చంపి... ఆపై చెట్టుకు ఉరివేసుకున్న తండ్రి
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, పాడుబడ్డ బావిలో నుంచి ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. ఇద్దరి చేతులు, కాళ్లకు తాళ్లు కట్టేసి ఉన్నాయి. మరొకరి కోసం గాలిస్తున్నామని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:ప్రియాంక ఆఫర్‌కు సై అన్న యోగి సర్కార్!
TAGGED:
Father suicide in Tamil Nadu