కామాంధుల చేతిలో చిన్న పిల్లలు, మానసిక రోగులు బలైపోతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అలాంటి అమానుష ఘటనే తమిళనాడు అరియలూర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మానసిక రుగ్మతతో బాధపడుతోన్న ఓ మహిళపై తండ్రీకొడుకులు అత్యాచారానికి పాల్పడ్డారు.
అరియలూర్ జిల్లా శ్రీపురాంథన్ గ్రామానికి చెందిన కుమార్(45), అతని కొడుకు కాళిదాస్ అలియాస్ కార్తిక్(22).. తమ ఇంటికి సమీపంలో ఉండే మానసిక రోగి అయిన మహిళ(32)పై వేరువేరు సందర్భాల్లో అత్యాచారం చేశారు. ప్రస్తుతం ఆ అభాగ్యురాలు 4 నెలల గర్భవతి. ఆమెకు తంజావూర్‌లోని వైద్య కశాళాలలో చికిత్స అందుతోంది.
బాధితురాలి సోదరుడు.. మహిళా పోలీస్ స్టేషన్లో తండ్రీకొడుకులపై ఫిర్యాదు చేసిన క్రమంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 12న ఇరువురిని అరెస్ట్ చేసి త్రిచి జైలుకు తరలించారు పోలీసులు.