నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసిస్తూ హరియాణా పాల్వాల్‌లో రైతులు ట్రాక్టర్ ర్యాలీని నిర్వహిస్తున్నారు. నేరుగా సింఘు సరిహద్దుకు వెళ్తున్నట్లు జాతీయ కిసాన్ మజ్దూర్ మహాసంఘ్ జాతీయ అధ్యక్షుడు శివ కుమార్ తెలిపారు.
లైవ్: 'ట్రాక్టర్' ఎక్కిన రైతన్న- సాగు చట్టాలపై పోరు
Ahead of the proposed tractor march on Thursday, a high alert has been sounded by the intelligence agencies in the National Capital Region (NCR) for two days. The proposed tractor march at the KMP (Kundli-Manesar-Palwal) bypass will begin at 11 am with a large batch of tractors from all borders.
11:28 January 07
పాల్వాల్‌లో రాలీ
10:34 January 07
పోలీసుల మోహరింపు..
రైతుల ర్యాలీ పల్వాల్ వరకు సాగాల్సినప్పటికీ.. నోయిడా వరకే పరిమితమవ్వనుందని ఘజియాబాద్ జిల్లా ఏడీఎమ్ శైలేంద్ర కుమార్ సింగ్ వెల్లడించారు. ప్రతి చోటా వీడియో రికార్డింగ్ కోసం ఏర్పాట్లు చేసినట్టు స్పష్టం చేశారు. రైతుల ట్రాక్టర్ ర్యాలీ నేపథ్యంలో సరిపడా పోలీసు బలగాన్ని మోహరించినట్టు తెలిపారు.
10:26 January 07
దిల్లీ సరిహద్దులో రైతన్నలు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
09:39 January 07
లైవ్: రైతుల ట్రాక్టర్ ర్యాలీ
కొత్త వ్యవసాయ చట్టాల రద్దు లక్ష్యాన్ని సాధించే వరకూ వెనకడుగు వేయబోమని దిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులు స్పష్టం చేశారు. వర్షం కారణంగా బుధవారం వాయిదాపడిన ట్రాక్టర్ల ర్యాలీని గురువారం నిర్వహించనున్నట్లు తెలిపారు. దీక్షా స్థలి నుంచి కుండ్లి-మనేసర్-పల్వాల్ వరకు వాహనాల ప్రదర్శన కొనసాగనుంది.