కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు దిల్లీ వరకు నిరసన ర్యాలీ చేపట్టేందుకు యత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. హరియాణాలోని అంబాలా వద్ద దిల్లీ-చంఢీగఢ్ రహదారిపై నిరసనకారులను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ప్రతిఘటించిన వారిపై జలఫిరంగులు ప్రయోగించారు.
సాగు చట్టాలపై పంజాబ్ రైతుల పోరుబాట - farmers protest against farm bills at delhi
హరియాణాలోని అంబాలా వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా పంజాబ్ రైతులు దిల్లీ వెళ్లి ఆందోళనలు చేపట్టేందుకు ప్రయత్నించగా భద్రతాదళాలు అడ్డుకున్నాయి. జలఫిరంగులు ప్రయోగించాయి.
రైతులను అడ్డుకున్న కేంద్రబలగాలు
అయితే దేశ రాజధానిలో నిరసన చేపట్టేందుకు రైతులకు అనుమతి ఉందని దిల్లీ పోలీసులు స్పష్టంచేశారు.