తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉల్లి ఎగుమతుల నిషేధంపై రైతులు ఆగ్రహం

ఉల్లి ఎగుమతుల నిషేధాన్ని వ్యతిరేకిస్తూ.. ఆందోళనలు చేపట్టారు రైతులు. వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాాండ్​ చేస్తూ మహారాష్ట్ర నాసిక్​లో​ రోడ్టెక్కారు.

Farmers in Nashik stage protest against over central govt's decision to ban the export of onions with immediate effect
ఉల్లి ఎగుమతుల నిషేధంపై రైతన్నల నిరసనలు

By

Published : Sep 15, 2020, 4:34 PM IST

దేశంలోని అన్ని రకాల ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధం విధించటంపై నిరసన బాట పట్టారు రైతులు. ఎగుమతులకు తిరిగి అనుమతినివ్వాలని డిమాండ్​ చేస్తూ మహారాష్ట్ర నాసిక్​లో ఆందోళనలు చేపట్టారు.

రోడ్డెక్కిన రైతులు

ప్రస్తుతం రాష్ట్రంలో ఉల్లిపాయను కిలోకు 20-25 రూపాయలకు విక్రయిస్తున్నారని.. ఎగుమతులను నిషేధిస్తే.. కిలోకు 2 నుంచి 3 రూపాలయలకు ధర తగ్గుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల ఉల్లిని సాగుచేసిన రైతులు భారీగా నష్టపోతారని పేర్కొన్నారు. కొనుగోలు దారుడు రైతుల నుంచి తక్కువ ధరకు కొని తర్వాత అధిక ధరకు అమ్ముకుంటారని వాపోయారు నాసిక్​లోని ఉల్లి రైతులు.

ఉల్లి ఎగుమతుల నిషేధంపై రైతన్నల నిరసనలు

దేశంలో అన్ని రకాల ఉల్లిపాయల ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. తక్షణమే ఈ నిషేధం అమలులోకి వస్తుందని పేర్కొంటూ విదేశీ వాణిజ్య డైరెక్టర్‌ జనరల్‌ (డీజీఎఫ్‌టీ) ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశంలో ఉల్లిపాయల లభ్యతను పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో అధిక వర్షపాతం నమోదు కావడంతో పంటలపై తీవ్ర ప్రభావం పడిందని, దీని ఫలితంగా నెలలోనే ఉల్లిధర మూడు రెట్లు పెరిగినట్టు పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details