ఆన్లైన్ క్లాసులు మరొక విద్యార్థి ఉసురు తీశాయి. స్మార్ట్ ఫోన్ కొనలేదని తమిళనాడు కల్లాకురిచి జిల్లా ఉలుందుర్ పేటకు చెందిన నిత్యశ్రీ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
ఇదీ జరిగింది...
ఆన్లైన్ క్లాసులు మరొక విద్యార్థి ఉసురు తీశాయి. స్మార్ట్ ఫోన్ కొనలేదని తమిళనాడు కల్లాకురిచి జిల్లా ఉలుందుర్ పేటకు చెందిన నిత్యశ్రీ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
ఇదీ జరిగింది...
అరుముగన్కు ముగ్గురు కూతుళ్లు. కరోనా వ్యాప్తి కారణంగా ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు ముగ్గురికీ స్మార్ ఫోన్ అవసరమైంది. అయితే అంత స్తోమత లేని అరుముగన్ రూ.20 వేలు పెట్టి ముగ్గురికీ కలిపి ఒక స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. అయితే ఏకకాలంలో ముగ్గురు ఆన్లైన్ క్లాసులకు హాజరుకాలేకపోతున్నారు. ఒక్కరు మాత్రమే హాజరవుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో స్మార్ట్ ఫోన్ కొనివ్వాలని కూతుళ్లు అరుముగన్ను అడిగారు. అయితే డబ్బులు లేక కాదన్నాడు.
తీవ్ర మనస్తాపానికి గురైన పెద్ద కూతురు నిత్య ఆగస్ట్ 29న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులు మందు తాగింది. పొలం పనుల నుంచి వచ్చిన అరుముగన్ నిత్యను వెంటనే ఉలుందర్పేట ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అయితే చికిత్స చేసినప్పటికీ ఆమె సోమవారం చనిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:ఐదుగురు భర్తలుండగా.. 22 ఏళ్ల ప్రియుడితో ఆరో పెళ్లి!