కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ.. శుక్రవారం భారత్ బంద్కు పిలుపునిచ్చాయి దేశంలోని వివిధ రైతు సంఘాలు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఆందోళనలకు రైతులు సన్నద్ధమవుతున్నారు.
అన్నదాతలు చేపట్టిన భారత్ బంద్కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు.. రైతులకు అండగా నిలుస్తారని పేర్కొంది. రైతులకు హాని కలిగించే బిల్లులను కేంద్రం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఆ రాష్ట్రాల్లో...
పంజాబ్, హరియాణాలో భారత్ బంద్ ప్రభావం ఎక్కువగా కనపడే అవకాశాలు ఉన్నాయి. రైల్రోకోతో ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో నిరసనలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం పంజాబ్ బంద్కు పిలుపునిచ్చారు ఆ రాష్ట్ర రైతులు. వీరికి హరియాణా రైతులతో పాటు 31 రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి.