తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అన్నదాతకు అండగా

రైతులకు ఆర్థిక సాయం అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వ పథకం 'రైతుబంధు' తరహాలో ఓ పథకాన్ని రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. పాడి, ఆక్వా రైతులకూ వరాలు ప్రకటించింది.

కర్షకవరాలు

By

Published : Feb 1, 2019, 7:51 PM IST

గోయల్​
మధ్యంతర బడ్జెట్​లో కేంద్రం వ్యవసాయరంగానికి పెద్దపీట వేసింది. సార్వత్రిక ఎన్నికల ముందు 'అన్నదాత'పై వరాల జల్లు కురిపించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు తరహాలోనే 'ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి' పథకాన్ని ప్రకటించారు ఆర్థిక మంత్రి పీయూష్​ గోయల్​.

"తక్కువ కమతాలున్న రైతులకు ప్రభుత్వ సాయం ఎంతో అవసరం. అందుకోసమే చిన్న, సన్నకారు రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన తీసుకొస్తున్నాం. 2 హెక్టార్లలోపు భూమి ఉన్న రైతులకు ఏటా రూ. 6 వేలను ప్రభుత్వం అందిస్తుంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం నేరుగా చేరవేస్తుంది. ఫలితంగా 12 కోట్ల మంది రైతులు ప్రత్యక్షంగా లబ్ధి పొందుతారు. 2018 డిసెంబర్​ 1 నుంచే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాం. ఈ పథకానికి అయ్యే అంచనా వ్యయం రూ.75 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. "

- పీయూష్​ గోయల్​, కేంద్ర ఆర్థిక మంత్రి

కేంద్రం గుర్తించిన 22 పంటల ఉత్పత్తి వ్యయం కంటే 50 శాతం అదనంగా స్థిర కనీస మద్దతు ధర అందేలా చూస్తామని గోయల్​ ప్రకటించారు. పశు సంవర్ధకం, మత్స్య శాఖాభివృద్ధిపైనా బడ్జెట్​లో పెద్ద మొత్తమే వెచ్చించారు.

"పశువుల పెంపకం, చేపల ఉత్పత్తి రంగాలకు ప్రభుత్వ మద్దతు అవసరం. 'జాతీయ గోకుల్​ మిషన్'​కు ఈ ఒక్క ఆర్థిక సంవత్సరానికే రూ.750 కోట్లు కేటాయించాం. గోవుల జన్యుపరమైన వనరులు కాపాడటం, గోవుల ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందించేందుకు ఇది ఉపయోగపడుతుంది. చేపల ఉత్పత్తిలో భారత దేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. క్షేత్ర స్థాయిలో 1.45 కోట్ల మంది దీనిద్వారా జీవనోపాధి పొందుతున్నారు. మత్స్య రంగం అభివృద్ధికై ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. సహజ విపత్తులు సంభవించినపుడు రైతులు పంట రుణాలను తిరిగి చెల్లించలేకపోతున్నారు. ప్రస్తుతం ఉన్న 2 శాతం వడ్డీ రాయితీని పెంచాలని నిర్ణయించాం."

-పీయూష్​ గోయల్​, కేంద్ర ఆర్ధిక మంత్రి

ABOUT THE AUTHOR

...view details