తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నా ఫొటోను ఆ ఆర్డినెన్స్​ ప్రచారానికి వాడుకోకండి'

ఒకే దేశం- ఒకే మార్కెట్​ ఆర్డినెన్స్​ ప్రచారం కోసం కేంద్రం జారీ చేసిన పోస్టర్​లో తన ఫొటో ప్రచురించడాన్ని పంజాబ్​కు చెందిన ఓ రైతు తప్పుబట్టారు. తన ఫొటోను తొలగించాలని డిమాండ్ చేశారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఆర్డినెన్స్​ను రద్దు చేయాలని కోరారు.

Farmer protest for putting his image on the advertisement of 'One Country One Market'
'నా ఫొటోను ఆ ఆర్డినెన్స్​ ప్రచారానికి వాడుకోకండి'

By

Published : Aug 12, 2020, 11:50 AM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఒకే దేశం- ఒకే మార్కెట్' ఆర్డినెన్సును రద్దు చేయాలని పంజాబ్​లో రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకే దేశం- ఒకే మార్కెట్​పై కేంద్రం జారీ చేసిన పోస్టర్ ప్రకటనలో తన ఫొటోను ఉపయోగించడంపై ఫరీద్​కోట్​కు చెందిన గుర్​ప్రీత్​ సింగ్ అనే రైతు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ప్రకటనలో గుర్​ప్రీత్ సింగ్ ఫొటో(వృత్తంలో)

రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఈ ఆర్డినెన్సును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు గుర్​ప్రీత్. పోస్టర్లపై తన ఫొటోను సైతం తొలగించాలని స్పష్టం చేశారు.

రైతులకు ప్రయోజనాలు కలిగించే సంక్షేమ పథకాలపై తన ఫొటోను ప్రచురిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ ఈ ఆర్డినెన్స్ ప్రచార పత్రాలపై తన ఫొటో ఉపయోగించడం మాత్రం ఇష్టంలేదన్నారు.

ఇదీ చదవండి-కరోనా పంజా: 23 లక్షలు దాటిన కేసులు

ABOUT THE AUTHOR

...view details