గణతంత్ర దినోత్సవం వేళ రైతుల ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. సింఘూ, టిక్రీ, ఘాజీపుర్ సరిహద్దుల నుంచి బయల్దేరిన కాసేపటికి పలు చోట్ల ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. నిషిద్ధ ప్రాంతాల నుంచి వెళ్లేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.
సిక్రీ సరిహద్దు వద్ద ట్రాక్టర్లతో వచ్చిన రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు.
ఇదే క్రమంలో పోలీసులపైకి ఓ వృద్ధ రైతు కత్తితో దూసుకెళ్లాడు.
దిల్లీలోని సంజయ్ గాంధీ ట్రాన్స్పోర్ట్ నగర్ వద్ద కూడా ఉద్రిక్తతలు తలెత్తాయి. సింఘూ సరిహద్దు నుంచి ఇక్కడికి వచ్చిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.