తెలంగాణ

telangana

మహా భాజపా శాసనసభాపక్ష నేతగా మరోసారి ఫడణవీస్

By

Published : Oct 30, 2019, 3:35 PM IST

మహారాష్ట్ర భాజపా శాసనసభా పక్షనేతగా మరోసారి దేవేంద్ర ఫడణవీస్​ ఎన్నికయ్యారు. ముంబయిలోని విధాన్​ భవన్​లో జరిగిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఈ నిర్ణయం తీసుకున్నారు.

MH-FADNAVIS

మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు తమ నాయకుడిగా దేవేంద్ర ఫడణవీస్​ను మరోసారి ఎన్నుకున్నారు. ముంబయిలోని విధాన్​ భవన్​లో భేటీ అయిన నూతన శాసనసభ్యులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశంలో ఇటీవలే ఎన్నికైన 105 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వీరితోపాటు కేంద్ర ప్రతినిధులుగా కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్, పార్టీ ఉపాధ్యక్షుడు అవినాశ్ రాయ్ ఖన్నా ఉన్నారు. ఫడణవీస్​ మినహా మరే పేరు పోటీకి రాలేదని, నాయకుడిగా ఆయననే ఎన్నుకున్నట్లు తోమర్​ ప్రకటించారు.

ఫడణవీస్ కృతజ్ఞతలు​

మరోసారి శాసనసభ పక్షనేతగా ఎన్నికైన ఫడణవీస్.. మిగిలిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రేకూ ధన్యవాదాలు చెప్పారు.

ప్రభుత్వ ఏర్పాటులో కీలక ప్రక్రియను పూర్తి చేసుకుంది భాజపా. ఇక శివసేనతో కొనసాగుతున్న ప్రతిష్టంభనను ఎలా ఎదుర్కోవాలో దృష్టి సారించే అవకాశం ఉంది. భాజపా ఎలాంటి వ్యూహాలను అనుసరించనుందోననే ఉత్కంఠ నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details