తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ పీఠం కోసం 'కాలనీ'లపై కేంద్రం కన్ను - దిల్లీ పీఠం దిశగా కాలనీల సమస్యకు కేంద్రం పరిష్కారం

దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రజలను ఆకర్షించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో అనుమతి లేని కాలనీల్లో నివాసం ఉంటున్న 40 లక్షల మందికి యాజమాన్య హక్కులు కల్పించేలా చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి హరిదీప్​ సింగ్​ తెలిపారు.

దిల్లీ పీఠం దిశగా కాలనీల సమస్యకు కేంద్రం పరిష్కారం

By

Published : Oct 23, 2019, 9:38 PM IST

మహారాష్ట్ర, హరియాణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిల్లీపై దృష్టి సారించింది. దేశ రాజధానిలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతుంది. దిల్లీలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రివర్గం.

నగరంలోని అనుమతి లేని కాలనీల్లో నివాసం ఉంటున్న 40 లక్షల మందికి యాజమాన్య హక్కులు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్​. దీనికి సంబంధించి వచ్చే పార్లమెంట్​ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రమంత్రి హరిదీప్​ సింగ్​ వెల్లడించారు.

"11 సంవత్సరాల నుంచి ఉన్న కాలనీ సమస్యను దిల్లీ ప్రభుత్వం పరిష్కరించలేకపోయింది. అంతేకాకుండా సమస్యను పూర్తి చేయటానికి 2021 వరకు గడువు కోరింది" అని తెలిపారుహరిదీప్​సింగ్. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన కేజ్రీవాల్​ ప్రభుత్వం... సమస్యను పరిష్కరించలేదని భావించే ఈ విషయంలో చొరవ తీసుకున్నట్లు ఆయన​ స్పష్టం చేశారు.

భాజపా కార్యకర్తల సంబరాలు...

కేబినెట్​ నిర్ణయంపై దిల్లీ భాజపా శ్రేణులు సంతోషం వ్యక్తం చేశాయి. 40 లక్షల మందికి యాజమాన్య హక్కుల కల్పించేలా కేంద్ర నిర్ణయం వెలువడగానే కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

ఇదీ చూడండి:హరియాణాలో మరోసారి కమలం పాగా వేస్తుందా..!

ABOUT THE AUTHOR

...view details