పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నిందితుడు నీరవ్‌మోదీపై లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. భారత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభ్యర్థన మేరకు వెస్ట్ మినిస్టర్ న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. లండన్‌లోని నీరవ్ నివాసానికి అరెస్టు వారెంట్ పంపనున్న ఆధికారులు.. ఆ తర్వాత ఎప్పుడైనా అతనిని అరెస్టు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ముందస్తు బెయిల్ కోసం నీరవ్ మోదీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
నీరవ్ మోదీకి అరెస్ట్ వారెంట్ - అరెస్టు వారెంట్
వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీపై లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఫలితంగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడుగా ఉన్న నీరవ్‌మోదీని స్వదేశానికి రప్పించేందుకు మార్గం సుగమమైంది.
నీరవ్ మోదీకి అరెస్ట్ వారెంట్
ఇదీ నేపథ్యం..
పీఎన్బీలో సుమారు 2 బిలియన్ డాలర్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్‌మోదీ భారత్ నుంచి పరారై లండన్‌లో స్వేచ్ఛగా విహరిస్తున్నారు. ఈ విషయంపై ఈడీ... లండన్ వెస్ట్ మినిస్టర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఫలితంగా న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీని స్వదేశానికి రప్పించేందుకు మార్గం సుగమమైంది. నీరవ్‌మోదీపై ఈడీ, సీబీఐ అక్రమ నగదు చెలామణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.
Last Updated : Mar 19, 2019, 8:21 PM IST