తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైల్వే 'ఈ-బుకింగ్స్'​పై ఇక అదనపు వడ్డన

రైలు ప్రయాణానికి ఐఆర్​సీటీసీలో బుకింగ్ ధరలు పెరగున్నాయి. ఈ మేరకు ఆగస్టు 30 న ఉత్తర్వులు జారీ చేసింది రైల్వే శాఖ. నాన్​ ఏసీకి రూ.15, ఏసీకి రూ. 30 చొప్పున సేవా పన్ను రూపంలో పెరగనుంది.

రైల్వే 'ఈ-బుకింగ్స్'​పై అదనపు వడ్డన

By

Published : Sep 1, 2019, 10:05 AM IST

Updated : Sep 29, 2019, 1:19 AM IST

రైల్వే 'ఈ-బుకింగ్స్'​పై అదనపు వడ్డన

రైలు ప్రయాణానికి ఐఆర్​సీటీసీలో నేటి నుంచి సేవా పన్ను విధిస్తున్నట్లు భారత రైల్వే శాఖ తెలిపింది. ఈ మేరకు ఆగస్టు 30న ఆదేశాలు జారీ చేసింది. 'ఈ-టికెట్' బుక్​ చేసుకుంటే నాన్​ ఏసీకి రూ.15, ఏసీకి రూ. 30 అదనంగా చెల్లించవలసి వస్తుంది

గతంలో రేట్లు

ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్​ ఇండియాలో భాగంగా ఐఆర్​సీటీసీలో సేవా పన్ను రద్దు చేశారు. గతంలో బుకింగ్స్​పై నాన్​ ఏసీకి రూ. 20, ఏసీకి రూ. 40 చొప్పున సేవా పన్ను విధేంచేవారు. 3 ఏళ్ల క్రితం ఈ పన్ను తొలగించారు.

వీరికి ఊరట

ప్రధాని మోదీ డిజిటల్​ ఇండియాలో భాగంగా భీమ్​ యాప్, యూపీఐ​ ద్వారా టికెట్​ బుక్ చేసుకున్నవారికి కొంత వెసులుబాటు కల్పించారు. నాన్​ ఏసీ బుకింగ్​ చేసుకునేవారు రూ.10 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి:అసోం ఎన్​ఆర్​సీపై దేశవ్యాప్తంగా అసమ్మతి స్వరాలు

Last Updated : Sep 29, 2019, 1:19 AM IST

ABOUT THE AUTHOR

...view details