తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైల్వే స్టేషన్​లో పేలిన 'పార్సిల్​'.. ఒకరికి గాయాలు - karnataka blast

కర్ణాటక హుబ్లీ రైల్వే స్టేషన్​లో అనుమానాస్పద వస్తువు పేలడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు.

రైల్వే స్టేషన్​లో పేలిన 'పార్సిల్​'.. ఒకరికి గాయాలు

By

Published : Oct 21, 2019, 4:44 PM IST

రైల్వే స్టేషన్​లో పేలిన 'పార్సిల్​'.. ఒకరికి గాయాలు
కర్ణాటక హుబ్లీ రైల్వే స్టేషన్​లో చిన్నపాటి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి గాయపడ్డాడు.

స్టేషన్​లో ఎవరూ పట్టించుకోకుండా వదిలేసిన పార్సిల్​ను ఓ వ్యక్తి పట్టుకోగానే... అది పేలింది. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. పక్కనే గాజు గోడ ముక్కలైంది. ప్రస్తుతం క్షతగాత్రుడు రైల్వే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ పేలుడుతో స్టేషన్​లోని ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్‌పీఎఫ్ సిబ్బంది, పోలీసు అధికారులు డాగ్ స్క్వాడ్‌తో ముమ్మరంగా తనిఖీ చేశారు. పేలింది బాంబా, లేక మొబైల్​ ఫోన్​ ఏదైనా అయి ఉంటుందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇదీ చూడండి:'ఆరే' మెట్రో కార్​ షెడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవట్లేదు: సుప్రీం

ABOUT THE AUTHOR

...view details