తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీబీఐ పనితీరు సరైనదేనా? - ఏకే సింగ్​

బంగాల్​ వివాదంలో సీబీఐ తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు రాజ్యాంగ నిపుణులు.

సీబీఐ పనితీరు సరైనదేనా?

By

Published : Feb 4, 2019, 6:02 PM IST

దేశప్రజల చూపు ఇప్పుడు పశ్చిమబంగ వైపే. సీబీఐ అధికారులని నిర్భందించి వివాదానికి తెరలేపిన పోలీసు అధికారుల నుంచి మమత సత్యాగ్రహం వరకు రాష్ట్రమంతటా హైడ్రామా కొనసాగుతోంది.

ఈ అంశంపై పలువురు నిపుణుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. పూర్తి వ్యవహారంలో సీబీఐ సరిగ్గా వ్యవహిరించలేదని కొందరు అంటే... మరికొందరు మాత్రం సీబీఐపై రాష్ట్ర పోలీసులకు ఎలాంటి అధికారాలు ఉండవని చెప్పారు.

సీబీఐ పనితీరును ఆ సంస్థ మాజీ సంచాలకుడు​ ఏకే సింగ్​ తప్పుపట్టారు. పోలీసు కమిషనర్​ నివాసానికి వెళ్లేముందు జాగ్రత్తపడాల్సిందని అభిప్రాయపడ్డారు.

సీబీఐ పనితీరును ఆ సంస్థ మాజీ సంచాలకుడు​ ఏకే సింగ్​ తప్పుపట్టారు.
  • ప్రశ్న:- విచారించడానికి అనుమతించలేదని సీబీఐ ఆరోపిస్తోంది. నియమాలకు విరుద్ధమని కోల్​కతా పోలీసులు అంటున్నారు.
  • స:- దీనిపై సరైన వివరాలు నాకు తెలియదు. పోలీసు కమిషనర్​ను విచారించాలి అనుకున్నారు కానీ ఆయన సహకరించలేదని అన్నారు. ముందు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్లాలి. ప్రధాన కార్యదర్శి, డీజీపీ, పోలీసులు ఉంటారు. ముఖ్యమంత్రితోనే మాట్లడొచ్చు. వీరు మాకు సహకరించట్లేదు... మీరు సహాయం చేయమని అడగవచ్చు. ముఖ్యమంత్రి అంగీకరించకపోతే అప్పుడు కోర్టుకెళ్లాలి. కానీ పోలీసు కమిషనర్​ ఇంటికి వెళ్లడం ఏంటి? సీబీఐ సిబ్బంది సాధారణ దుస్తుల్లో ఉంటారు. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇది పెద్ద ఘటనే అని నా అభిప్రాయం. సహకారం అందకపోతే కోర్టుకెళ్లాలి. హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి అదేశాలు తెచ్చుకోవాలి. అప్పుడు పోలీసు కమిషనర్​ ముందుకు వచ్చి మాట్లడాల్సిందే.

-- ఏకే సింగ్​, సీబీఐ మాజీ సంచాలకుడు

రాజ్యాంగ నిపుణుడు శుభాష్​ కశ్యప్​ కోల్​కతా పోలీసుల చర్యను తప్పుబట్టారు.

రాజ్యాంగ నిపుణుడు శుభాష్​ కశ్యప్​ కోల్​కతా పోలీసుల చర్యను తప్పుబట్టారు.
  • ప్రశ్న:- ఓ రాష్ట్ర అధికారిని సీబీఐ విచారించేందుకు వస్తే ఆ రాష్ట్ర అధికారులు, పోలీసులు వారిని అడ్డుకోవటం సరైనదేనా?
  • స:- ఇది చాలా తప్పు. రాజ్యాంగానికి విరుద్ధం. 256, 257 అధికరణల్లో ఇది స్పష్టంగా ఉంది. కేంద్ర వ్యవస్థలపై రాష్ట్ర పోలీసుల అధికారాలు పనిచేయవు. కానీ ఈ వ్యవహారం అంతా రాజకీయ గొడవలాగా ఉంది. కొంతమంది రాష్ట్ర అధికారుల ద్వారా కేంద్రాన్ని రెచ్చగొట్టాలని అనుకుంటున్నారు.

-- శుభాష్​ కశ్యప్, రాజ్యాంగ నిపుణుడు

ABOUT THE AUTHOR

...view details