తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​ అంశంపై నిపుణుల్లో భిన్న స్వరాలు

జమ్ముకశ్మీర్​పై కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయాలపై న్యాయ, రాజ్యాంగ నిపుణుల్లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఒక వర్గం ప్రభుత్వ చర్యను న్యాయమైన చర్యగా అభివర్ణిస్తూ స్వాగతిస్తున్నాయి. మరో వర్గం కేంద్రం నిర్ణయం వెనుక రాజకీయకోణాలున్నట్లు వాదిస్తోంది.

కశ్మీర్​ అంశంపై నిపుణుల్లో భిన్న స్వరాలు

By

Published : Aug 6, 2019, 8:01 AM IST

జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్​ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై న్యాయనిపుణులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైందేనని ఓ వర్గం వాదిస్తుంటే.. మరో వర్గం వారు ఇది రాజకీయ లబ్ధి కోసమేనని అంటున్నారు.

ఆర్టికల్ 370 రద్దుపై భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అనుకున్నట్లుగానే అధికరణను రద్దు చేసింది. దీనికి తోడు జమ్ముకశ్మీర్​ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తూ పునర్​వ్యవస్థీకరణ బిల్లును రాజ్యసభలో ఆమోదింపజేసుకుంది.

కేంద్రం చట్టబద్ధ నిర్ణయమే తీసుకుంది

తాజా పరిస్థితులపై సీనియర్​ న్యాయవాది, రాజ్యాంగ న్యాయ నిపుణులు రాకేశ్​ ద్వివేది స్పందించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిగా చట్టబద్ధమైనదేనని పేర్కొన్నారాయన.

"చాలాకాలంగా మరుగున పడిన అంశమిది. ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకం. ఇది స్వాగతించదగ్గదే. కశ్మీర్​లో బయటి వాళ్లకు అవకాశాలిస్తున్నప్పుడు అక్కడ ఆర్టికల్ 35-ఏ అవసరమేంటో నాకర్థం కావడం లేదు.(ఆర్టికల్ 35ఏ కల్పించే హక్కులను గుర్తు చేస్తూ)"
-రాకేశ్​ ద్వివేది, రాజ్యాంగ న్యాయ నిపుణులు

ఆర్టికల్​ 35ఏ కశ్మీరీ స్థానికతను ధ్రువీకరిస్తుంది. దీని ద్వారానే అక్కడ నివసించే వారికి ప్రత్యేక హక్కులు లభిస్తాయి. 1954 మే14న రాజ్యాంగంలో ఈ అధికరణ చేర్చారు.
'ఆర్టికల్ 370 కారణంగా ఇప్పటి వరకు జమ్ముకశ్మీర్​లో చట్టాలు వర్తించేవికావు. ఇకపై అక్కడ అన్ని చట్టాలు వర్తిస్తాయి' అని మాజీ ఆటార్నీ జనరల్​ సోలి సర్బోజి అన్నారు.

కనీసం విపక్షాలతో సంప్రదించలేదు

కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్​పై తీసుకున్న నిర్ణయం రాజకీయఅంశంతో కూడుకున్నదని కాంగ్రెస్ సీనియర్​ నేత, న్యాయవాది, కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి అశ్వనీ కుమార్ అన్నారు.

"కొన్ని రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఏదో జరగబోతుందనే విషయం అందరికీ అర్థమైంది. అయితే విపక్షాలతో కేంద్రం సంప్రదింపులు జరపకుండా ఇలాంటి ప్రతిపాదనను తీసుకురావడం సరైందికాదు."
- అశ్వనీ కుమార్​, కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి

ఇదీ చూడండి: '370 రద్దు ఉగ్రవాద విషవృక్షం అంతానికే'

ABOUT THE AUTHOR

...view details