ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజల్లో విద్వేషాన్ని రాజేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. మోదీ ఒక్కోసారి తన కుటుంబాన్ని దూషిస్తున్నారని, మరికొన్నిసార్లు ప్రతీకారం తీర్చుకుంటామని మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి ఖాయమన్న ఆలోచన కారణంగానే ఇలాంటి గందరగోళ వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
మోదీ పాలన విద్వేషం, వైఫల్యాలమయం: రాహుల్
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. హిమాచల్ ప్రదేశ్ సోలన్లో ఈటీవీ భారత్తో ప్రత్యేకంగా మాట్లాడారు.
మోదీ పాలన విద్వేషం, వైఫల్యాలమయం: రాహుల్
సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు ముగియడానికి కొద్ది గంటల ముందు హిమాచల్ ప్రదేశ్ సోలన్లో ఈటీవీ భారత్తో ప్రత్యేకంగా మాట్లాడారు రాహుల్.
ఉపాధి కల్పన, వ్యవసాయ సంక్షోభం, ఇతర కీలక సమస్యల పరిష్కారంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని ధ్వజమెత్తారు రాహుల్. ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మామిడి పళ్లు తినడం గురించి మాట్లాడుతున్నారంటూ... సినీ నటుడు అక్షయ్ కుమార్తో ప్రధాని ముఖాముఖిని ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు.
- ఇదీ చూడండి: 300 సీట్లతో మళ్లీ మేమే వస్తాం: మోదీ