తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అంతిమ విజయం సత్యానిదే-నిర్భయ తల్లిదండ్రులతో ముఖాముఖి - ईटीवी भारत

నిర్భయ దోషులకు ఉరిపై స్పందించారు బాధితురాలి తల్లిదండ్రులు. తమకుమార్తెకు జరిగిన అన్యాయం పట్ల దేశం మొత్తం స్పందించిందని ఈటీవీ భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖి వేదికగా దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అంతిమంగా సత్యమే గెలిచిందని పేర్కొన్నారు.

nirbhaya
నిర్భయ తల్లిదండ్రులతో ముఖాముఖి

By

Published : Mar 20, 2020, 8:27 PM IST

నిర్భయ తల్లిదండ్రులతో ముఖాముఖి

నిర్భయ దోషుల ఉరిపై బాధితురాలి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. నిర్భయకు న్యాయం జరిగిందని ఈటీవీ భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖి వేదికగా పేర్కొన్నారు. తమ కుమార్తెకు జరిగిన అన్యాయం పట్ల దేశం మొత్తం స్పందించిందని వ్యాఖ్యానించారు నిర్భయ తల్లి ఆశాదేవి. అయితే ఆలస్యమైనా న్యాయమైతే జరిగిందని పేర్కొన్నారు. నలుగురు దోషులకు శిక్ష పడటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

'దోషుల న్యాయవాదిపై'

రాజ్యాంగాన్ని దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు బాధితురాలి తల్లి. ఈ కేసును ఇంత సాగదీయడం సరికాదని వెల్లడించారు. ఏపీ సింగ్ సత్యాన్ని అసత్యంగా మార్చేందుకు యత్నించారన్నారు. అయితే అంతిమంగా న్యాయమే విజయం సాధించిందని వెల్లడించారు. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్న వ్యక్తులపైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఆశాదేవి.

'సమయభావంపై'

నిర్భయ కేసులాంటి పెద్ద కేసుల్లో కూడా శిక్ష అమలుకు ఏడేళ్లు తీసుకుందని.. ఈ వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. నిర్భయ కేసులో రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేయడం పట్ల ఆవేదన ఉండేదని.. అయినా ఏదో ఒక రోజు సత్యం గెలుస్తుందన్న నమ్మకం తమలో ఉన్నట్లు పేర్కొన్నారు.

'దేశం తోడుగా నిలిచింది'

ఈ ఏడేళ్లుగా కేవలం తాము మాత్రమే సంఘర్షణకు గురికాలేదని.. యావద్దేశం నిర్భయకు న్యాయం జరగాలని కోరుకుందని వ్యాఖ్యానించారు బాధితురాలి తండ్రి. మాతో దేశం నిలవకపోతే న్యాయం జరిగేది కాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి:న్యాయం గెలిచింది.. మహిళా భద్రతే ముఖ్యం: మోదీ

ABOUT THE AUTHOR

...view details