తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశంలోని రెండు కరోనా వ్యాక్సిన్లు అత్యంత సురక్షితం'

ఐసీఎంఆర్​, భారత్​ బయోటెక్ సంయుక్తంగా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్​ మొదటి దశ క్లినికల్​ ట్రయల్స్​ 'అత్యంత సురక్షితం'గా ఉన్నట్లు రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ సహయ మంత్రి అశ్విని చౌబే తెలిపారు. రెండు వ్యాక్సిన్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరిచాయని.. రెండో దశ ట్రయల్స్​ కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

'Excellent safety' of 2 indigenous COVID candidate vaccines revealed during Phase-I trials: Minister
బయోటెక్​ టీకా వ్యాక్సిన్​ మొదటిదశ ట్రయల్స్ విజయవంతం

By

Published : Sep 15, 2020, 9:07 PM IST

దేశీయంగా తయారు చేస్తున్న రెండు కరోనా వ్యాక్సిన్ల మొదటి దశ క్లినికల్​ ట్రయల్స్​ అత్యంత సురక్షితంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే రాజ్యసభలో మంగళవారం వెల్లడించారు. కాడిలా హెల్త్​కేర్​ లిమిటెడ్ సహా భారత్ బయోటెక్​, ఐసీఎంఆర్​ సంయుక్తంగా తయారు చేస్తున్న క్యాండిడేట్ వ్యాక్సిన్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరిచినట్లు తెలిపారు. ప్రస్తుతం వీటిపై రెండో దశ ప్రయోగాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్ల పనితీరుపై రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు సదరు మంత్రి. ఐసీఎంఆర్​ నేతృత్వంలో 14 క్లినికల్​ ట్రయల్​ కేంద్రాల్లో రెండో, మూడో దశ పరీక్షలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. చెన్నైలోని క్షయవ్యాధుల నేషనల్ ఇన్​స్టిట్యూట్​ సెంటర్​ ప్రధాన కేంద్రంగా ట్రయల్స్ జరుగుతున్నట్లు వెల్లడించారు.

సమర్థవంతమైన టీకాను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం, ప్రైవేటు రంగ సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయని... టీకా అభివృద్ధిలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పూర్తి సమాచారం వెల్లడించటం కుదరదని అశ్విని చౌబే వెల్లడించారు.

కొవిడ్​ వ్యాక్సిన్ అభివృద్ధిలో ప్రేమాస్ బయోటెక్, జెన్నోవా, మైన్వాక్స్, ఎపిజెన్ బయోటెక్, లక్స్​మాత్రా ఇన్నోవేషన్స్, బయోలాజికల్ ఎవాన్స్, ఇతర సంస్థలు ప్రిక్లినికల్​ ట్రయల్స్​ దశలో ఉన్నట్లు తెలిపారు మంత్రి. దేశవ్యాప్తంగా 30 వ్యాక్సిన్లు వివిధ దశల్లో ప్రయోగాలు జరుపుతున్నట్లు బయోటెక్నాలజీ విభాగం తెలిపిందని పేర్కొన్నారు. వీటిలో మూడు వ్యాక్సిన్లు తొలి, రెండో, చివరి దశలో ఉన్నాయని.. మరో 4కు పైగా వ్యాక్సిన్లు ప్రి క్లినికల్​ దశలో ఉన్నాయని వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ల అభివృద్ధి కోసం ఐసీఎంఆర్​ రూ.25 కోట్లను కేటాయించినట్లు తెలిపారు.

అలాగే రష్యా అభివృద్ధి చేసిన టీకా ఉత్పత్తి సహకారంపై చర్చలు జరుగుతున్నాయని చౌబే చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details