తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాబ్రీ కేసులో కల్యాణ్​సింగ్​కు ఊరట- బెయిల్​ మంజూరు

బాబ్రీ కేసులో రాజస్థాన్​ మాజీ గవర్నర్​ కల్యాణ్​ సింగ్​కు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్​ మంజూరు చేసింది. రూ.2 లక్షల పూచీకత్తుతో బెయిల్​ ఇచ్చింది న్యాయస్థానం.

బాబ్రీ కేసులో కల్యాణ్​సింగ్​కు ఊరట- బెయిల్​ మంజూరు

By

Published : Sep 27, 2019, 4:07 PM IST

Updated : Oct 2, 2019, 5:34 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, రాజస్థాన్​ మాజీ గవర్నర్​ కల్యాణ్​ సింగ్​కు బాబ్రీ కేసులో స్వల్ప ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి బెయిల్​ మంజూరు చేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.

గవర్నర్​గా పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. అందుకు అనుగుణంగా శుక్రవారం న్యాయస్థానం ముందుకు వచ్చారు కల్యాణ్​ సింగ్​.

ఇరు వర్గాల వాదనల అనంతరం కల్యాణ్​ సింగ్​కు బెయిల్​ మంజూరు చేసింది న్యాయస్థానం. రూ. 2 లక్షలు పూచీకత్తు సమర్పించాలని ఆదేశించినట్లు ఆయన తరఫు న్యాయవాది మనీశ్​ తెలిపారు.

అందరూ బెయిల్​ పైనే..

1992లో బాబ్రీ ఘటన సమయంలో ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రిగా ఉన్నారు కల్యాణ్ సింగ్. 1993లో ఆయనపై అభియోగపత్రం నమోదైంది. అయితే... తదనంతర కాలంలో రాజస్థాన్​ గవర్నర్​ అయ్యారు కల్యాణ్ సింగ్​. రాజ్యాంగపరంగా ఉన్న రక్షణల కారణంగా బాబ్రీ మసీదు కేసులో నిందితుడిగా ఆయన్ను విచారించడం సాధ్యపడలేదు.

సెప్టెంబర్​ 3న రాజస్థాన్​ గవర్నర్​గా పదవీకాలం ముగిసిన నేపథ్యంలో కల్యాణ్​ను విచారించేందుకు ప్రత్యేక కోర్టును అనుమతి కోరింది సీబీఐ. ఈ అభ్యర్థనపై స్పందించిన న్యాయస్థానం... సింగ్​కు సమన్లు జారీచేసింది.

ఈ కేసులో భాజపా అగ్రనేతలు ఎల్​కే అడ్వాణీ, మురళీ మనోహర్​ జోషీతో పాటు పలువురు నేతలు నిందితులుగా ఉన్నారు. వారంతా ప్రస్తుతం బెయిల్​పై ఉన్నారు.

ఇదీ చూడండి: ఏనుగును ఢీకొట్టి నిలిచిపోయిన రైలు​

Last Updated : Oct 2, 2019, 5:34 AM IST

ABOUT THE AUTHOR

...view details