తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'విమర్శించిన ఎంపీలనే భాజపాలో చేర్చుకున్నారు' - న్యాయం

రాజకీయాల్లో భాజపా  ఏం చేసినా కమలనాథులకు న్యాయంగానే అనిపిస్తుందని బహుజన్ సమాజ్​ పార్టీ అధినేత్రి మాయావతి ఎద్దేవా చేశారు. రాజ్యసభలోని నలుగురు తెలుగుదేశం పార్టీ సభ్యులు భాజపాలోకి ఫిరాయించడంపై మాయ ఘాటుగా స్పందించారు.

భాజపా ఏం చేసినా న్యాయమే: మాయావతి

By

Published : Jun 21, 2019, 6:46 PM IST

Updated : Jun 21, 2019, 7:50 PM IST

భాజపా 'ఆపరేషన్​ ఆకర్ష్'పై బహుజన్​ సమాజ్​ పార్టీ అధినేత్రి మాయావతి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు భాజపాలో చేరడంపై మాయావతి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

మాయావతి ట్వీట్

"రాష్ట్రపతి నిన్న తన ప్రసంగంలో ప్రభుత్వం తరఫున దేశానికి హామీలు ఇస్తుంటే... అదే రోజు భాజపా ఆపరేషన్​ ఆకర్ష్​తో నలుగురు తెదేపా ఎంపీలను లాగేసుకుంది. అందులో ఇద్దరు ఎంపీలను భాజపా గతంలో 'ఆంధ్ర మాల్యా​' అని విమర్శించింది. ఇప్పుడు వారినే పార్టీలోకి చేర్చుకొంది. ఇదంతా చూస్తుంటే ఒకటైతే స్పష్టంగా తెలుస్తోంది. భాజపా ఏం చేసినా అది న్యాయమే."
- మాయావతి, బీఎస్పీ అధినేత్రి

ఇదీ నేపథ్యం..

రాజ్యసభలో తెదేపా తరఫున ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆరుగురిలో నలుగురు ఎంపీలు నిన్న భాజపా చెంతకు చేరారు. అంతేకాకుండా భాజపాలోకి తెదేపా రాజ్యసభా పక్షాన్ని విలీనం చేయాలని ఉపరాష్ట్రపతిని కోరారు.

Last Updated : Jun 21, 2019, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details