ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధభూమి సియాచిన్. ఇక్కడ విధులు నిర్వర్తించడమంటే ప్రాణాలకు తెగించి పోరాడటమే. ఈ ప్రాంతంలో గస్తీ కాసే సైన్యానికి ప్రత్యేక సదుపాయాలు కల్పించనుంది కేంద్రం. అక్కడి తీవ్రమైన చలి, ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా మౌలిక సదుపాయాలు కల్గిన రెండు కిట్లను ప్రతి ఒక్క సైనికుడికీ అందజేయనుంది. లక్ష రూపాయలు విలువగల 'పర్సనల్ కిట్', 1.5 లక్ష విలువ చేసే 'ఎక్విప్మెంట్ కిట్'ను ఇవ్వనుంది. ఈ మేరకు సైనిక వర్గాలు వెల్లడించాయి.
పర్సనల్ కిట్లో ఏముంటాయి..?
సైనికులు చలికి తట్టుకునేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఈ కిట్ ద్వారా అందించనుంది. ఇందులో రూ.28 వేలు విలువచేసే శీతాకాలపు మందపాటి దుస్తులు, రూ.13వేలు విలువచేసే ప్రత్యేకమైన నిద్రించే బ్యాగ్ ఒకటి, రూ.14వేల విలువ చేసే డౌన్ జాకెట్, ప్రత్యేక గ్లవ్స్.. రూ.12 వేల విలువైన షూ ఉంటాయి.
ఎక్విప్మెంట్ కిట్...