తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయ్యప్ప సన్నిధిలో కిటకిటలాడుతున్న 'భస్మాకుళం'..! - శబరిమల భస్మాకుళం

శబరిమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ తరుణంలో అయ్యప్ప సన్నిధి సమీపంలోని.. భస్మాకుళం కొలను.. జలకాలాడే స్వాములతో కిటకిటలాడుతోంది. ఇంతకీ.. ఈ కొలను ప్రత్యేకత ఏంటి? ఇక్కడ అయ్యప్ప మాల ధరించిన స్వాములందరూ ఎందుకు స్నానం చేస్తారో తెలుసుకుందాం..

every devotees who comes to sabarimala takes bath at the sacred pond Bhasmakulam in the temple
అయ్యప్ప సన్నిధిలో కిటకిటలాడుతున్న 'భస్మాకుళం'..!

By

Published : Nov 29, 2019, 8:23 PM IST

Updated : Mar 1, 2020, 2:55 AM IST

అయ్యప్ప సన్నిధిలో కిటకిటలాడుతున్న 'భస్మాకుళం'..!
అయ్యప్ప మాల ధరించి స్వామి దర్శనానికి శబరిమల వచ్చే భక్తులు ఇక్కడి ఆచార సంప్రదాయలు తప్పక పాటించాల్సిందే. ఆలయంలోనికి ప్రవేశించే ముందు, పవిత్ర కొలనులో స్నానమాచరించాలన్నదీ ఇక్కడ అనాదిగా వస్తున్న సంప్రదాయం. అందుకే, "భస్మాకుళం" అనే ఈ పవిత్ర కొలనులో వందలాది మంది భక్తులు పవిత్ర స్నానం చేస్తున్నారు.

ఆలయంలో నిత్యం పూజలు నిర్వహించే పూజారులు సైతం ఈ కొలనులో స్నానం చేసిన తర్వాతే పూజలు నిర్వహిస్తారు. అయితే, మలికప్పురం నుంచి వంద మీటర్ల దూరంలో ఉండే ఈ కొలనులో కేవలం స్నానం మాత్రమే చేయాలి. అందుకే ఇక్కడ స్నానం చేసేటప్పుడు నూనె, సబ్బు వంటివి వాడటం పూర్తిగా నిషేధం.

మాల ధరించిన స్వాములు తమ వస్తువులను, పాత్రలను శుభ్రం చేసుకునేందుకు, ఆలయానికి సమీపంలో పత్రకుళం అనే మరో కొలను ఉంది. అందుకే భస్మాకుళం కొలనులో నిత్యం వందలాది మంది స్నానాలు ఆచరించినా.. నీరు శుభ్రంగా ఉంటోంది.​​​​​​

ఇదీ చదవండి:పదేళ్ల బాలుడి ఫిర్యాదుకు.. ఫ్రెండ్లీ పోలీస్ ఫిదా!​

Last Updated : Mar 1, 2020, 2:55 AM IST

ABOUT THE AUTHOR

...view details