తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈటీవీ భారత్ కథనంతో.. తీరిన కష్టం!

కరోనా వేళ పేద విద్యార్థిని వెతలను తెలిపిన ఈటీవీభారత్ కథనానికి తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి స్పందించారు. తమిళనాడులో ఫోన్ లేక ఆన్​లైన్ క్లాసులకు హాజరుకాలేకపోయిన ఓ విద్యార్థినికి సాయం అందింది.

ETV Bharat Impact: Minister hands over smart phone to a poor student!
ఈటీవీ భారత్ కథనంతో.. తీరిన కష్టం!

By

Published : Sep 6, 2020, 9:48 AM IST

Updated : Sep 6, 2020, 12:00 PM IST

ఈటీవీ భారత్ కథనంతో.. తీరిన కష్టం!

ఈటీవీ భారత్ కథనానికి అనూహ్య స్పందన లభించింది. ఆన్​లైన్​ క్లాసులు వినేందుకు ఓ విద్యార్థినికి స్మార్ట్ ఫోన్ అందేలా చేసింది.

నమక్కల్​ జిల్లా కన్నూర్​పట్టికి చెందిన తమిళరసి.. ముగ్గురు బిడ్డల తల్లి. రెండేళ్ల క్రితం భర్తను పోగొట్టుకుంది. అప్పటి నుంచి పిల్లల బాధ్యత తానే చూసుకోవాల్సి వచ్చింది.పెద్దకూతురు సౌందర్య(20) డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. రెండో కూమార్తె శుభసౌమ్య(15) ఇంటర్ ఫస్ట్ ఇయర్​లో చేరింది. కుమారుడు మణికంట(14) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ముగ్గురూ ప్రభుత్వ బడుల్లోనే చదువుతూ మంచి మార్కులు సాధించేవారు. కానీ, కరోనా వేళ ఆన్​లైన్ క్లాసులకు హాజరు కాలేకపోయారు.

ఫోన్ వచ్చింది.. ఇక క్లాసులు తప్పను!

తమిళరసి ఇంట్లో ఉన్నది ఒకే ఫోనూ. ఒకే ఫోన్​లో, ఒకేసారి ముగ్గురు ఆన్​లైన్ క్లాసులు వినడం కుదరలేదు. తరగతులకు హాజరుకాలేక వారు పడుతున్న గోసలను ఈ నెల 3న ఈటీవీ భారత్ ప్రసారం చేసిన కథనానికి తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి తంగమణి, నమక్కల్ జిల్లా కలెక్టర్ మేగ్​రాజ్ స్పందించారు. రెండో కూతురు శుభసౌమ్యకు ఓ స్మార్ట్ ఫోన్ అందించారు.

విద్యార్థినికి సాయం
ఫోన్ అందిస్తూ...

"మేము ముగ్గురం అమ్మ సంపాదనపైనే ఆధారపడి బతుకున్నాం. పేదరికంలో ఫోన్ లేక ఇక్కట్లు పడ్డాం. కానీ, ఈటీవీ భారత్ వల్ల మా బాధలు మంత్రి వరకు చేరాయి. మాకు సాయం అందింది. ఈటీవీ భారత్​కు హృదయపూర్వక కృతజ్ఞతలు."

-శుభసౌమ్య, విద్యార్థిని

ఇదీ చదవండి: నలుగురు గిరిజనులను చంపిన నక్సలైట్లు

Last Updated : Sep 6, 2020, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details