లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి, దిల్లీ నిజాముద్దీన్‌లో ప్రార్థనలు నిర్వహించిన 'తబ్లీగ్-ఎ-జమాత్' సంస్థ అధిపతి మౌలానా సాద్‌పై ఆదాయ పన్నుశాఖ సహా అన్ని రకాల దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి.
ఇప్పటి వరకు దిల్లీ పోలీసులు కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన... నిజాముద్దీన్ వ్యవహారంపైనే విచారణ చేపట్టారు. కానీ ఇప్పుడు తబ్లీగ్ ఈ జమాత్ సంస్థ అధిపతిపై దృష్టి కేంద్రీకరించారు. ఆయన ఆదాయ వనరులు, కార్యకలాపాలపై దర్యాప్తు చేస్తున్నారు.
విలాస పురుషులా?
తబ్లీగీ జమాత్ సంస్థ అధిపతి మౌలానా సాద్‌కు షామ్లిలో అత్యంత విలాసవంతమైన ఫామ్ హౌస్‌తో పాటు ఖరీదైన స్థిర, చరాస్తులు ఉన్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు గుర్తించారు. మౌలానా సాద్‌కు ఖరీదైన కార్లు అంటే చాలా ఇష్టమని తెలుస్తోంది.
కుటుంబమంతా
మౌలానా సాద్ ముగ్గురు కుమారులు మార్కాజ్, నిజాముద్దీన్, షరీఫ్... దర్గా కార్యనిర్వాహక కమిటీలో ముఖ్య సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరికి సంబంధించిన కోట్ల రూపాయల ఆదాయం, ఖర్చుల సమాచారాన్ని కూడా దర్యాప్తు సంస్థలు పరీశీలీస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి దిల్లీ వరకు ఉన్న అన్ని ప్రధాన ఆస్తులు, ఆదాయ మార్గాలపై అనధికారిక దర్యాప్తు ప్రారంభమైందని తెలిపారు అధికారులు. తగిన సాక్ష్యాలు, పత్రాల ధ్రువీకరణ అయిన మరుక్షణం చర్యలు తీసుకునేందుకు ఆదాయ పన్ను శాఖ సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంకా ఈ విషయాలపై లోతుగా విచారణ జరిపేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.