మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. ఈ సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు హిందూ సంవత్సరాది 'గుడి పద్వా' శుభాకాంక్షలు తెలిపిన ఉద్ధవ్.. ఈ కష్ట సమయంలో ప్రతి పురుషుడు తమ 'హోంమంత్రి'(భార్య) చెప్పిన విధంగా నడుచుకోవాలని, తాను కూడా అదే చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వీలైనంతవరకు ఏసీలను తగ్గించి, సహజ సిద్ధమైన గాలికే ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. నిత్యావసరాల నిల్వలు తగినంత ఉన్నాయని, ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. మాస్కులు తయారు చేయడానికి కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు ఠాక్రే.