జమ్ము కశ్మీర్ షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. సైన్యంపై కాల్పులకు తెగించారు. ముష్కరుల దుశ్చర్యకు దీటుగా స్పందించినజవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.
షోపియాన్‌లో ఎదురుకాల్పులు-ఇద్దరు జవాన్లకు గాయాలు - జమ్ము
జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.
షోపియాన్‌లో ఎదురుకాల్పులు-ఇద్దరు జవాన్లకు గాయాలు
షోపియాన్‌లోని పండూషన్ ప్రాంతంలో అర్థరాత్రి తనిఖీలు చేస్తున్న భద్రతా బలగాలపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు ముష్కరులు.
ఇదీ చూడండి: భారత్-పాక్ కోరితేనే కశ్మీర్‌పై జోక్యం: ట్రంప్