జమ్ముకశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో సుదీర్ఘంగా సాగిన ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వారి నుంచి ఆయుధాలు, ఇతర సామగ్రిని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
కశ్మీర్లో ఎన్కౌంటర్- ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం - Kashmir encounter today news
11:19 September 25
కశ్మీర్లో ఎన్కౌంటర్- ఇద్దరు ఎల్‌ఈటీ ఉగ్రవాదులు హతం
సిర్హామా ప్రాంతంలో ముష్కరులు ఉన్నారన్న కచ్చితమైన సమాచారంతో గురువారం రాత్రి నిర్బంధ తనిఖీలు చేపట్టారు భద్రతా సిబ్బంది. ఉదయం ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడగా... జవాన్లు దీటుగా తిప్పికొట్టారు. ఇద్దరిని మట్టుబెట్టారు.
10:28 September 25
కశ్మీర్లో ఎన్కౌంటర్- ఇద్దరు ఎల్‌ఈటీ ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్ అనంతనాగ్ జిల్లా సిర్హామాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఎల్‌ఈటీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.