జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బందికి మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.
షోపియాన్ జిల్లా కెల్లెర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. సైన్యం, సీఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీసు శాఖ సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి.ముష్కరులు ఉన్న ప్రాంతంలో గాలింపు చర్యలు ప్రారంభించాయి.
భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. జవాన్లు దీటుగా స్పందించారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. వారి నుంచి భద్రతా సిబ్బంది ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
హంద్వారాలో మరో ఎన్కౌంటర్
హంద్వారాలోని యారో లంగేట్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్లు సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఆ ప్రాంతంలో ముమ్మర తనిఖీలు చేపట్టాయి. ఈ సమయంలో వారిపై కాల్పులకు తెగబడ్డ ముష్కరులకు దీటుగా సమాధానమిస్తున్నారు జవాన్లు.
కాల్పులు ఇంకా కొనసాగుతున్న కారణంగా స్థానికంగా పాఠశాలలు, కళాశాలలు ముసేయించారు అధికారులు. స్థానికంగా చరవాణీ అంతర్జాల సేవలు నిలిపేశారు.