ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో ఏడుగురు నక్సల్స్ హతం - POLICE
10:33 August 03
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్- ఏడుగురు నక్సల్స్ హతం
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. రాజ్నంద్గావ్లోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల చేతిలో ఏడుగురు నక్సలైట్లు హతమయ్యారు.
మహారాష్ట్ర సరిహద్దు సమీపంలోని షోర్పుర్, సీతాగోటా మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై అధికారులకు సమాచారం అందింది. ఉదయం జిల్లా రిజర్వు గార్డు, కేంద్ర బలగాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. వీరి రాకను పసిగట్టిన నక్సలైట్లు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా సిబ్బంది దీటుగా స్పందించారు. ఎదురుకాల్పుల్లో ఏడుగురు నక్సల్స్ మరణించారు. వీరి నుంచి ఏకే-47 సహా అనేక ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.