జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో బలగాలపై ఉగ్ర మూకలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు భద్రతా సిబ్బంది, ఒక పౌరుడు మృతి చెందారు.
ఐదుగురు జవాన్లు మృతి
కుప్వారా సెక్టార్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు జరిగింది. ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు సహా ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఎన్ కౌంటర్
ఉదయం నుంచి భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు కొనసాగుతోంది.
ఈ కాల్పుల్లో తొమ్మిది మంది భద్రతా సిబ్బంది గాయపడగా అందులో ఐదుగురు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో సీఆర్పీఎఫ్ అధికారి,జవాన్, ఇద్దరు ఆర్మీ సిబ్బంది, ఒక స్థానిక పోలీసు ఉన్నారని తెలిపారు.