ఒక అభ్యర్థి పేరు 'ఎంపికైన వారి జాబితా'లో ఉన్నప్పటికీ సరైన కారణాలుంటే వారి నియామకాన్ని తిరస్కరించే హక్కు యజమానికి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన ఓ అప్పీలును మంగళవారం కొట్టివేసింది. జిల్లా న్యాయమూర్తుల నియామకానికి దరఖాస్తులు కోరుతూ మధ్యప్రదేశ్ హైకోర్టు 2017 మార్చిలో ప్రకటన వెలువరించింది. దానికి స్పందించి దరఖాస్తు చేసుకున్నవారిలో ఒక న్యాయవాది.. ప్రధాన పరీక్షలోనూ, ముఖాముఖిలోనూ ఉత్తీర్ణుడైనా ఆయనపై ఒక క్రిమినల్ కేసు పెండింగులో ఉన్న కారణంగా ఆ తర్వాత జాబితా నుంచి పేరు తొలగించారు.
'నియామకం తిరస్కరణకు యాజమానికి హక్కు' - సుప్రీం కోర్టు తాజా సమాచారం
సరైన కారణాలుంటే ఎంపికైన అభ్యర్థి నియామకాన్ని తిరస్కరించే హక్కు యజమానికి ఉంటుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంలో మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన ఓ అప్పీలును కొట్టివేసింది.
'అభ్యర్థి నియామకాన్ని తిరస్కరించే హక్కు యజమానికి ఉంది'
దీనిని ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. భార్య తనపై దాఖలు చేసిన క్రిమినల్ కేసులో ఆ తర్వాత ఆయన నిర్దోషిగా బయటపడ్డారు. ఎంపిక జరిగిన తేదీ నాటికి క్రిమినల్ కేసు పెండింగులో ఉందనీ, ఓ ఏడాది తర్వాత దానిలో నిర్దోషిగా తేలినంత మాత్రాన గడియారాన్ని వెనక్కి తిప్పలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రిట్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడం తప్పేమీ కాదంది.