తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రహదారిపై విమానం అత్యవసర ల్యాండింగ్​ - ncc aircraft

ఉత్తరప్రదేశ్‌లో... సాంకేతిక కారణాలతో ఎన్​సీసీకి చెందిన ఓ చిన్న విమానం రహదారిపై ల్యాండ్‌ అయింది. విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్‌ విమానాన్ని సదర్‌పుర్‌ గ్రామంలోని ఎక్స్‌ప్రెస్‌వేపై దించాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

landing of aircraft
landing of aircraft

By

Published : Jan 23, 2020, 5:58 PM IST

Updated : Feb 18, 2020, 3:29 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ మేరఠ్​లోని సదర్​పుర్​​ ఎక్స్​ప్రెస్​వేపై ఎన్​సీసీకి చెందిన ఓ చిన్న విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. ఇంజిన్​ విఫలమవటమే ఈ ల్యాండింగ్​కు కారణంగా తెలుస్తోంది. విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.

రహదారిపై విమానం అత్యవసర ల్యాండింగ్​

హిండోన్​ వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన విమానంలో కాసేపటికే ఇంజిన్​ విఫలమయినట్లు గుర్తించారు. ల్యాండింగ్​లో కొద్దిమేర విమానం ధ్వంసమయింది. సదర్​పుర్​ ఎక్స్​ప్రెస్​ వే 6 లేన్ల రహదారి కావటం వల్ల ట్రాఫిక్​కు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదు.

Last Updated : Feb 18, 2020, 3:29 AM IST

ABOUT THE AUTHOR

...view details