జమ్ముకశ్మీర్‌లో షోపియాన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు మినీ బస్సు లోయలోపడి 11 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పూంచ్‌లోని ఓ విద్యాసంస్థ నుంచి షోపియాన్‌కు బయలుదేరిన మినీ బస్సు పీర్కి గలీ వద్ద లోయలో పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది బాలికలు, ఇద్దరు బాలురు మరణించారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురు విద్యార్థులను షోపియాన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.