ఒడిశా భువనేశ్వర్లో జనావాసాల్లోకి వచ్చిన ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. మనుషులపై దాడి చేసింది. ఘటనలో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు గాయపడ్డారు. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు.
జనావాసాల్లో గజరాజు బీభత్సం... నలుగురు మృతి - elephant entered into residential
ఒడిశాలో గజేంద్రుడు బీభత్సం సృష్టించాడు. జనావాసాల్లోకి ప్రవేశించి పౌరులపై దాడి చేయగా.. నలుగురు మృతి చెందారు. ప్రజల తప్పిదాలతోనే పౌరులు ప్రాణాలు కోల్పోయారని అటివీ అధికారులు వెల్లడించారు.
జనావాసాల్లోకి గజేంద్రుడు... దాడిలో నలుగురు పౌరులు మృతి
చందక వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం నుంచి దేలాంగ్ ప్రాంతానికి ఏనుగు వెళ్లినట్లు ప్రధాన అటవీ సంరక్షణాధికారి హెచ్ఎస్ ఉపాధ్యాయ తెలిపారు. గజేంద్రుడిని చూసి ప్రజలు దగ్గరకు వచ్చి ఫొటోలు తీయడం, తాకడానికి ప్రయత్నం చేశారని.. ఈ క్రమంలోనే పౌరులపై ఏనుగు దాడి చేసిందని చెప్పారు.
ఇదీ చూడండి:అధ్యక్షుడికి రాష్ట్రపతి విందుకు మన్మోహన్ గైర్హాజరు!
Last Updated : Mar 2, 2020, 11:24 AM IST