తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చెరుకుగెడల కోసం రహదారి దిగ్బంధించిన గజరాజు - sugarcane

సత్యమంగళం-మైసూర్ జాతీయ రహదారిపై ఓ ఏనుగు హల్​చల్ చేసింది.  హైవే పైకి వచ్చి ఇంధనం లేక ఆగిపోయిన లారీలోని చెరకును ఆరగించింది. రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు గజరాజు దృశ్యాలను చిత్రీకరించేందుకు పెద్దయెత్తున గుమిగూడారు. అటవీ శాఖ సిబ్బంది వచ్చి ఏనుగును అడవిలోకి పంపించారు. అవాంతరం తొలగిపోయి వాహనాలకు మార్గం సుగమమైంది.

చెరుకుగెడల కోసం రహదారి దిగ్బంధించిన గజరాజు

By

Published : Jun 24, 2019, 5:13 PM IST

Updated : Jun 24, 2019, 7:34 PM IST

చెరుకుగెడల కోసం రహదారి దిగ్బంధించిన గజరాజు

తమిళనాడులోని ఈరోడ్ తలవాడి నుంచి సత్యమంగళానికి చెరకు లోడ్​తో వెళుతోంది ఓ లారీ. ఇంధనం లేక మైసూర్- సత్యమంగళం జాతీయ రహదారిలోని ఆసనూర్ వద్ద నిలిచిపోయింది. అప్పుడే పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అటుగా వచ్చింది ఓ గజరాజం. చెరకు గెడలను చూసి నోరూరిపోయిందేమో...! ఎంచక్కా ఆరగించడం ఆరంభించింది.

చెరకు గెడలను ఆస్వాదిస్తున్న ఏనుగు దృశ్యాలను కెమెరాలో బంధించేందుకు రహదారి వెంట వెళుతున్న ప్రయాణికులు ఆసక్తి చూపారు. ఈ కారణంగా జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఏనుగును వెనక్కి పంపే సాహసం చేయలేక అటవీ అధికారులకు సమాచారమిచ్చారు స్థానికులు.

ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది ఏనుగును అడవిలోకి పంపించేశారు. అవాంతరం తొలగిపోయి వాహనాలకు మార్గం సుగమమైంది.

ఇదీ చూడండి: 'మన ప్రధానమంత్రి మంచి సేల్స్​మన్​'

Last Updated : Jun 24, 2019, 7:34 PM IST

ABOUT THE AUTHOR

...view details