ఓ గజరాజుకు అడవిలో తినేందుకు ఏమీ దొరకలేదేమో ఆకలితో అలమటిస్తూ జనావాసాల్లోకి చేరింది. కనిపించిన రెస్టారెంట్లోకి చొరబడి... ఆహారం కోసం వెతికింది. కానీ అందుబాటులో ఏమీ కనిపించలేదు. నిరాశగా వెనుదిరిగింది ఆ ఏనుగు. కోయంబత్తూర్లో జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
ఏనుగు వచ్చిన సమయంలో తమ ఉద్యోగులు బిజీగా ఉన్నారని రెస్టారెంట్ వర్గాలు చెప్పాయి.