పెండింగ్లో ఉన్న 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల తేదీని ఖరారు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. జూన్ 19న పోలింగ్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.
18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల తేదీ ఖరారు
కరోనా కారణంగా వాయిదాపడ్డ 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల తేదీని ఖరారు చేసింది ఈసీ. జూన్ 19న ఎన్నికలు జరపనున్నట్లు స్పష్టం చేసింది.
రాజ్యసభ ఎన్నికల తేదీ ఖరారు
ఈ నెల 19న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుందని.. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించింది ఈసీ. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతంలో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి.
రాష్ట్రాల వారీగా సీట్లు ఇలా..
- ఏపీ, గుజరాత్ రాష్ట్రాల్లో 4 చొప్పున రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
- మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 3 చొప్పున రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
- ఝూర్ఖండ్-2, మణిపూర్ 1, మేఘాలయ-1 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
- రాజ్యసభ 55 ఖాళీల్లో ఇప్పటికే 37 స్థానాలు ఏకగ్రీవం, 18 సీట్లకు ఎన్నికలు