17వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల కమిషన్. మొత్తం 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించనుంది. ఏప్రిల్ 11న తొలి విడత పోలింగ్‌తో ఎన్నికల పండుగ మొదలు కానుంది. మే 23న ఆఖరి విడత పోలింగ్ జరగనుంది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.
ఏయే రాష్ట్రాలు..ఎన్ని స్థానాలు.
మొదటి దశ:
ఆంధ్రప్రదేశ్ (25), తెలంగాణ (17), అరుణాచల్ ప్రదేశ్ (2), అసోం (5), బిహార్ (4), ఛత్తీస్‌గఢ్ (1), జమ్ముకశ్మీర్ (2), మహారాష్ట్ర (7), మణిపూర్ (1), మేఘాలయ (2), మిజోరం (1), నాగాలాండ్ (1), ఒడిశా (4), సిక్కిం (1), త్రిపుర (1), ఉత్తర్‌ప్రదేశ్ (10), ఉత్తరాఖండ్ (5), పశ్చిమ బంగా(2), లక్షద్వీప్ (1), అండమాన్ నికోబార్ (1)
రెండవ దశ:
జమ్ముకశ్మీర్ (2), అసోం (5), బిహార్ (5), ఛత్తీస్‌గఢ్ (3), కర్ణాటక (14), మహారాష్ట్ర (10), మణిపూర్ (1), ఒడిశా (5), తమిళనాడు (39), త్రిపుర (1), ఉత్తర్‌ప్రదేశ్ (8), పశ్చిమ్ బెంగాల్ (3), పుదుచ్చేరి (1)
మూడవ దశ..
అసోం (4), బిహార్ (5), ఛత్తీస్‌గఢ్ (7), గుజరాత్ (26), గోవా (2), జమ్ముకశ్మీర్ (1), కర్ణాటక (14), కేరళ (20), మహారాష్ట్ర (14), ఒడిశా (6), ఉత్తర్‌ప్రదేశ్ (10), పశ్చిమ్‌బెంగాల్ (5), దాద్రానగర్ హవేలీ (1), డామన్ డయ్యూ (1)