తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీరుకు విడిగా ఎన్నికలు..! - కశ్మీర్​

నాలుగు రాష్ట్రాల్లో శాసనసభకు, లోక్​ సభకు ఏకకాల ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది ఎన్నికల సంఘం. జమ్ముకశ్మీర్​కు మాత్రం విడిగా నిర్వహిస్తామని ప్రకటించింది.

ఎన్నికల సంఘం

By

Published : Mar 10, 2019, 10:20 PM IST

Updated : Mar 11, 2019, 12:03 AM IST

సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనతో దేశంలో ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. ఎన్నికల షెడ్యూల్​ ప్రకటించారు ప్రధాన ఎన్నికల అధికారి సునీల్​ అరోరా.

మొత్తం 7 విడతల్లో లోక్​సభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది ఈసీ.

నాలుగు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు:

ఆంధ్రప్రదేశ్​, సిక్కిం,అరుణాచల్​ ప్రదేశ్​, ఒడిశా రాష్ట్రాల్లో శాసనసభ, లోక్​సభ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించనున్నారు. ఏప్రిల్​-మే మధ్య కాలంలో ఈ నాలుగు రాష్ట్ర ప్రభుత్వాల కాల పరిమితి ముగియనుంది.

ఆంధ్రప్రదేశ్​: స్థానాలు:

శాసనసభ : 175, లోక్​సభ-25

సిక్కిం: స్థానాలు:

శాసనసభ : 32, లోక్​సభ-1

ఒడిశా: స్థానాలు:

శాసనసభ : 147, లోక్​సభ-21

అరుణాచల్​ ప్రదేశ్​: స్థానాలు

శాసనసభ : 60, లోక్​సభ-2

జమ్ముకి ఎందుకు లేవు..?

కశ్మీర్​ లోయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో శాసనసభకు, లోక్​సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం సాధ్యం కాదని ఎన్నికల సంఘం తెలిపింది. భద్రతా బలగాలు పరిమితంగా అందుబాటులో ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈసీ అరోరా తెలిపారు. ముందుగా లోక్​సభ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. అనంత్​ నాగ్​ లోక్​సభ స్థానానికి మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

Last Updated : Mar 11, 2019, 12:03 AM IST

ABOUT THE AUTHOR

...view details