తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీఏ నాటి కేసులో మాజీ మంత్రికి సమన్లు - Praful Pate

ఎయిర్ ఇండియా కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్​​ కేసులో కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్​ పటేల్​కు ఈడీ సమన్లు జారీ చేసింది. జూన్​ 6న విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. ఈడీ సమన్లపై స్పందించిన పటేల్... విచారణకు పూర్తిగా సహకరిస్తానని ప్రకటించారు.

ప్రఫుల్​ పటేల్​కు ఈడీ సమన్లు

By

Published : Jun 1, 2019, 5:21 PM IST

ఎన్సీపీ సీనియర్​ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్​కు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ సమన్లు జారీ చేసింది. యూపీఏ హయాం నాటి ఎయిర్​ ఇండియా కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్​ కేసు దర్యాప్తులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. జూన్​ 6న విచారణకు హాజరవ్వాలని పటేల్​ను ఆదేశించింది ఈడీ.

ఏంటీ కుంభకోణం..?

లాభాలు వచ్చే రూట్లు, సమయాల్లో ఎయిర్​ ఇండియా విమానాలు తిప్పకుండా చేయడం ద్వారా విదేశీ ప్రైవేటు విమానయాన సంస్థలకు అనుచిత లబ్ధి చేకూరేలా చేశారన్నది ప్రధాన అభియోగం. ఇందుకు ప్రతిఫలంగా పౌర విమానయాన శాఖ, ఎయిర్​ ఇండియా అధికారులకు ముడుపులు అందాయన్నది ఆరోపణ. ఆ సమయంలో ప్రఫుల్​ పటేల్​ పౌరవిమానయాన శాఖ మంత్రి.

ఎయిర్​ ఇండియాకు తీవ్ర నష్టం మిగిల్చిన ఈ వ్యవహారానికి సంబంధించి మనీలాండరింగ్​ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. విమానయాన రంగ మధ్యవర్తి దీపక్ తల్వార్​ను ఈ ఏడాది ఆరంభంలో అరెస్టు చేసింది. తల్వార్​ విచారణ ద్వారా తెలిసిన విషయాల్ని ప్రఫుల్​ పటేల్​ ముందు ఉంచి, వాస్తవం రాబట్టాలని భావిస్తున్నట్లు ఈడీ తెలిపింది.

విచారణకు సహకరిస్తా...

ఈడీ సమన్లపై స్పందించారు ప్రఫుల్ పటేల్​. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. విమానయాన రంగంలోని సంక్షిష్టతలను అధికారులు అర్థం చేసుకునేందుకు విచారణకు హాజరవుతానని ప్రకటించారు.

ఇదీ చూడండి : నితీశ్​ను ఒప్పించలేకపోయిన 'షా'...

ABOUT THE AUTHOR

...view details