మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కర్ణాటక మాజీ మంత్రి, సీనియర్ నేత డీకే శివకుమార్‌కు కొత్త చిక్కులొచ్చిపడ్డాయి. ఈ కేసులో విచారణ నిమిత్తం తాజాగా ఆయన కూతురు ఐశ్వర్యకు సమన్లు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సెప్టెంబర్ 12న దిల్లీలోని ఈడీ కార్యాలయానికి హాజరుకావాలని పేర్కొన్నారు అధికారులు.
2017లో తన కుమార్తెతో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్లినట్లుగా శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆమెను ప్రశ్నించనున్నారు. పర్యటన వివరాలను సేకరించనున్నారు. పీఎంఎల్ఏ (మనీ లాండరింగ్ నిరోధక చట్టం) కింద ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది ఈడీ.
పన్ను ఎగవేత, హవాలా లావాదేవీల విషయంలో.. శివకుమార్‌ను సెప్టెంబర్ 3న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేయగా, ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలోనే ఉన్నారు.