తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హురియత్​ నేత గిలానీకి జరిమానా విధించిన ఈడీ - fine

సయ్యద్ అలీషా గిలానీకి భారీ జరిమానా విధించింది ఈడీ. అక్రమంగా విదేశీ మారక ద్రవ్యం కలిగి ఉన్నాడన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది దర్యాప్తు సంస్థ.

గిలానీ

By

Published : Mar 23, 2019, 12:06 AM IST

హురియత్​ నేత సయ్యద్​ అలీషా గిలానీకి ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. పరిమితిని మించి విదేశీ మారక ద్రవ్యాన్ని కలిగి ఉన్నాడన్న కారణంతో రూ.14.40 లక్షల జరిమానా విధించింది ఈడీ.

గిలానీ వద్ద 2002లో 10 వేల అమెరికన్​ డాలర్ల (రూ.6.90 లక్షలు)ను ఆదాయపు పన్ను శాఖ గుర్తించి స్వాధీనం చేసుకుంది. ఐటీ శాఖ ఇచ్చిన నివేదికను అనుసరించి విదేశీ మారక చట్టం ప్రకారం దీనిని నేరంగా పరిగణించింది ఈడీ. విదేశీ మారక నియంత్రణ చట్టం (ఫెమా) కింద జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

"ఆయన వద్ద లభించిన సొమ్ముకు ఎలాంటి అనుమతులు లేవు. ఫలితంగా దీనిపై 30 రోజుల్లో సమాధానమివ్వాలని షోకాజ్ నోటీసులు పంపాం. దానిపై ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్న కారణంతో జరిమానా విధించాం."
- ఈడీ అధికారులు

మరో వేర్పాటు వాద నేత, 'జమ్ముకశ్మీర్ లిబరేషన్​ ఫ్రంట్' మాజీ ఛైర్మన్ యాసిన్ మాలిక్​ సైతం అక్రమ విదేశీ మారకాన్ని కలిగి ఉన్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ తెలిపింది.

ఇదీ చూడండి:కశ్మీర్​లో బాలుడ్ని కిరాతకంగా చంపిన ఉగ్రవాదులు

ABOUT THE AUTHOR

...view details