తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేటి నుంచి దేశవ్యాప్తంగా మెగా ఓటర్ల ధ్రువీకరణ

ఓటరు జాబితాలను సరిదిద్దడానికి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. నేటి నుంచి దేశవ్యాప్తంగా మెగా ఓటర్ల ధ్రువీకరణ కార్యక్రమం నిర్వహించనుంది. క్రౌడ్​ సోర్సింగ్​ ద్వారా ఆన్​లైన్​లో ఓటర్ల వివరాలను నమోదు చేయనుంది.

నేటి నుంచి దేశవ్యాప్తంగా మెగా ఓటర్ల ధ్రువీకరణ

By

Published : Sep 1, 2019, 5:10 AM IST

Updated : Sep 29, 2019, 1:02 AM IST

నేటి నుంచి దేశవ్యాప్తంగా మెగా ఓటర్ల ధ్రువీకరణ

క్రౌడ్ సోర్సింగ్ ద్వారా ఓటరు జాబితాలను సరిదిద్దే ప్రక్రియను ముమ్మరం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇందు కోసం నేటి నుంచి దేశవ్యాప్తంగా మెగా ఓటర్ల ధ్రువీకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమం అక్టోబర్​ 15 వరకు నిర్వహించనున్నారు.

ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఓటరు నమోదుకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఎన్​వీఎస్​పీ వెబ్‌సైట్‌ లేదా ఓటర్​ హెల్ప్​లైన్​ మొబైల్​ యాప్​ ద్వారా యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ను పొందుతారు. తన ఓటరు ధ్రువీకరణకు అవసరమైన పత్రాలను జతచేయడమే కాకుండా తన కుటుంబ సభ్యుల వివరాలను వెబ్‌సైట్లో నమోదు చేయవచ్చు. ఇలా నమోదు చేసిన వివరాలను బ్లాక్ లెవల్ అధికారులు ధ్రువీకరిస్తారు.

ఈ విధానం ద్వారా ఓటర్లకు.. జాబితా వివరాలను అంచనా వేయడానికి, ఓటరు వివరాల్లో తప్పులను సరిదిద్దడానికి అవకాశం ఏర్పడుతుందని దిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి రణ‌్​బీర్ సింగ్ తెలిపారు. మెగా ఓటరు ధ్రువీకరణ కార్యక్రమాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: పడవ పోటీల్లో మాస్టర్​ బ్లాస్టర్​ మెరుపులు

Last Updated : Sep 29, 2019, 1:02 AM IST

ABOUT THE AUTHOR

...view details