కేంద్ర ఎన్నికల సంఘం తీరు సరిగా లేదంటూ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత సైన్యాన్ని 'మోదీ సైన్యం' అని వ్యాఖ్యానిస్తే ఈసీ సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. చిన్నహెచ్చరికతో సరిపెట్టటం ఏంటని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది కాంగ్రెస్.
కాంగ్రెస్ కనీస ఆదాయ పథకం 'న్యాయ్' హామీపై విమర్శలు చేసిన నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్‌పై ఈసీ చర్యలు చేపట్టకపోవటంపైనా తీవ్రంగా స్పందించింది ఆ పార్టీ. న్యాయ్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తే భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కేవలం హెచ్చరికలు చేసి ఊరుకున్నారని అసహనం వ్యక్తంచేసింది. ప్రస్తుతం ఎంసీసీ(ఎన్నికల నిబంధనావళి) అంటే 'మోదీ కోడ్ ఆఫ్ కండక్ట్'గా మారిపోయిందని విమర్శించింది.