తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్ 'రేప్ ఇన్ ఇండియా' వ్యాఖ్యలపై ఈసీ ఆరా - rahul latest news

కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ వివాదాస్పద 'రేప్​ ఇన్​ ఇండియా' వ్యాఖ్యలపై వాస్తవిక నివేదిక సమర్పించాలని ఝార్ఖండ్​ ఎన్నికల అధికారులను ఆదేశించింది ఈసీ. ఈ నివేదిక అందిన తర్వాత రాహుల్​పై చర్యలు తీసుకునే విషయంపై స్పష్టత వస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి.

rahul gandhi, EC
రాహుల్ 'రేప్ ఇన్ ఇండియా' వ్యాఖ్యలపై నివేదిక కోరిన ఈసీ

By

Published : Dec 16, 2019, 11:50 AM IST

Updated : Dec 16, 2019, 2:47 PM IST

రాహుల్ 'రేప్ ఇన్ ఇండియా' వ్యాఖ్యలపై ఈసీ ఆరా

ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నివేదిక సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం.. ఝార్ఖండ్ ఎన్నికల అధికారులను ఆదేశించింది. గొడ్డా ప్రచార ర్యాలీలో ప్రసంగించిన రాహుల్.. మహిళలపై పెరుగుతున్న అత్యాచారాల విషయంలో మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ భారత్‌ను 'మేక్‌ ఇన్‌ ఇండియా'గా కాకుండా 'రేప్ ఇన్ ఇండియా'గా మార్చారని ఆరోపించారు.

రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి అత్యాచారాలను సాధనంగా ఉపయోగించుకున్నారని భాజపా నాయకులు రాహుల్​పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ చేపట్టింది ఈసీ. రాహుల్ వ్యాఖ్యలపై వాస్తవిక నివేదిక సమర్పించాలని ఝార్ఖండ్ ఎన్నికల అధికారులను ఆదేశించింది.

ఇదీ చూడండి: బంగాల్​లో వరుసగా నాలుగో రోజూ 'పౌర' ప్రకంపనలు

Last Updated : Dec 16, 2019, 2:47 PM IST

ABOUT THE AUTHOR

...view details