ఎన్నికల అఫిడవిట్‌కు సంబంధించి ఐటీ శాఖ తనకు నోటీసులు పంపిందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెల్లడించిన నేపథ్యంలో ఈసీ స్పందించింది. పవార్‌కు సంబంధించి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)కి తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది.
పవార్‌కు ఐటీ నోటీసులపై ఈసీ క్లారిటీ - శరద్ పవార్‌కు ఐటీ నోటీసులు
ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు నోటీసులు జారీ చేయాలని ఐటీ శాఖను ఆదేశించలేదని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈసీ ఆదేశాల మేరకు ఐటీ శాఖ తమకు నోటీసులు ఇచ్చిందన్న పవార్ ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది.
పవార్
"ఎన్నికల కమిషన్ ఆదేశించిన తర్వాత ఆదాయపు పన్ను శాఖ మాకు నోటీసులు జారీ చేసింది" అని పవార్ మంగళవారం తెలిపారు. తనతో పాటు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎంపీ సుప్రియా సూలే, మంత్రి ఆదిత్య ఠాక్రేకు ఈ నోటీసులు వచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇదీ చూడండి:శరద్ పవార్‌కు ఐటీ శాఖ నోటీసులు