తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మాయావతి, ఆదిత్యనాథ్​కు ఈసీ నోటీసులు - MAYAWATI

ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ఉత్తర​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​, బీఎస్పీ అధినేత్రి మాయావతికి షోకాజ్​ నోటీసులు జారీ చేసింది ఎన్నికల సంఘం. శుక్రవారం సాయంత్రంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

మాయావతి, ఆదిత్యనాథ్​లకు ఈసీ నోటీసులు

By

Published : Apr 12, 2019, 6:51 AM IST

Updated : Apr 12, 2019, 9:30 AM IST

మాయావతి, ఆదిత్యనాథ్​లకు ఈసీ నోటీసులు

ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న ఆరోపణలతో ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​, బీఎస్పీ అధినేత్రి మాయావతికి గురువారం ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఈ నెల 9న యూపీలోని మేరట్​లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన ఆదిత్యనాథ్​... సార్వత్రిక ఎన్నికలు రెండు మతాలకు మధ్య జరిగే పోటీగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఎన్నికల సంఘం నోటీసులు అందించింది.

మాయావతికీ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 7న దేవ్​బంద్​లో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించిన బీఎస్పీ అధినేత్రి... ఓ రాజకీయ పార్టీకి ఓటు వేయొద్దని ముస్లింలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి పలువురు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై నివేదిక అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని మాయావతిని ఈసీ ఆదేశించింది. వివరణ ఇవ్వకపోతే ఎలాంటి సమాచారం లేకుండానే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఇదీ చూడండీ:15 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్​ శూన్యం

Last Updated : Apr 12, 2019, 9:30 AM IST

ABOUT THE AUTHOR

...view details